పత్తికొండలో కేబి.. నర్సప్ప విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి
1 min read– పత్తికొండ కురువ సంఘం ఎంపీడీవో కు వినతి పత్రం అందజేత
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాయలసీమ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పాటుపడిన మాజీ మంత్రివర్యులు దివంగత కే.బి. నరసప్ప విగ్రహాన్ని ఏర్పాటుకు స్థలం కేటాయించాలని స్థానిక కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి రామారావుకు వినతి పత్రం సమర్పించారు. 1962, 1972, 978 సంవత్సరాల్లో మూడు పర్యాయాలు పత్తికొండ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యులుగా ఎన్నికై, ఈ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలు అందించిన కే.బి. నర్సప్ప స్మారకంగా విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి మండల చైర్మన్ గా కూడా కేబీ నర్సప్ప రాయలసీమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. కావున ఆయన సేవలను గుర్తించి మాజీ మంత్రివర్యులు మూడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై రాయలసీమ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కష్టపడిన నర్సప్ప విగ్రహాన్ని పత్తికొండ పట్టణంలోని హోసూరు సర్కిల్లో లేదా పట్టణంలోని మరోచోట గాని విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని స్థానిక గ్రామపంచాయతీ అధికారి, సర్పంచ్ కొమ్ము దీపికకు కురువ సంఘం నాయకులు లక్ష్మన్న, బురుజుల నాగభూషణం, రామలింగాయపల్లి చంద్రశేఖర్ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కే.బి. నర్సప్ప విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించడానికి ఎంపీడీవో డి రామారావు, పంచాయతీ ఈవో నరసింహులు సానుకూలంగా స్పందించారు.