జొన్న మద్దతు ధర ఇచ్చారు సంచులు మరిచారు.. ఆందోళనలో అన్నదాత..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్బికేల ద్వారా సేకరిస్తున్న జొన్న పంటకు మార్క్ఫెడ్ ద్వారా సంచులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అయితే అవసరం మేర రైతులకు సంచులు అందుబాటులో ఉంచకుండా బయట తెచ్చుకుంటే ఒప్పుకోమంటూ అధికారుల అనాలోచన నిర్ణయం రైతులకు కోపం తెప్పించింది గడివేముల మండలంలో వింత పరిస్థితి నెలకొంది పెసరవాయి గ్రామంలో రైతులు జొన్న సాగు చేశారు పంట మద్దతు ధర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సరిపడ సంచులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నదాతలు శుక్రవారం సాయంత్రం రోడ్డుకెక్కడం ఆందోళన నిర్వహించారు గ్రామంలో 1350 ఎకరాల్లో జొన్న పంట దాదాపు 300 మంది రైతులు పంట సాగు చేసి ప్రభుత్వం ఇస్తున్న 3180 మద్దతు ధరకు అర్హత సాధించారు అయితే సంచులు మార్క్ఫెడ్ ద్వారా మొదటి విడతలో 3250 సంచులు. శుక్రవారం నాడు 7000 సంచులను సరఫరా చేసింది ఇవి ఏ మూలకు చాలకపోవడం దాదాపు 30 వేల సంచులు అవసరం ఉంటుందని మండలంలో వింత పరిస్థితి నెలకొవడం ఇతర మండలాల్లో రైతులు సొంతంగా సంచులు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఆ తర్వాత ఇచ్చే సంచులను తీసుకోవడం జరుగుతుందని కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం సరఫరా చేసిన సంచుల్లోనే జొన్నలు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో పంట ఎప్పటికీ అమ్ముకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఎకరాకు 20 ఐదు సంచులు అవసరం ఉంటే 7 మాత్రమే ఇస్తామని వ్యవసాయ అధికారి తెలపడం తో సమస్య నెలకొంది విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి గౌరూ చరిత రెడ్డి శనివారం నాడు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు గ్రామంలో ఏకపక్షంగా రైతులను మోసం చేస్తున్నారని అధికార నాయకుడి కనుసనుల్లో ఏవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పండించిన ప్రతి ఒక్క రైతు పంటను కొనుగోలు చేయాలని ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యే దృష్టికి సమస్య రావడంతో జేసి రాహుల్ కుమార్ రెడ్డితో మాట్లాడి దాదాపు పదివేల సంచులు రైతులు కందెల ఏర్పాటు చేసినట్టు స్థానిక వైసీపీ నాయకులు తెలిపారు.. ఏదేమైనా మద్దతు ధర కల్పించి సంచులు అందుబాటులో ఉంచకపోవడం రైతన్నకు శాపంగా మారింది ఇప్పటికైనా అధికారులు సమస్య లేకుండా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నారు.