వైసీపీకి గుణపాఠం చెప్పేందుకే ప్రజలు కార్యదీక్ష చేపట్టారు..
1 min readనియోజకవర్గ అభ్యర్థి బడేటి చంటి
21వ డివిజన్ లో ప్రజాసంకల్పయాత్ర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ కార్యదీక్షను చేపట్టారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి – జనసేన ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ది చెప్పడంతో పాటూ మరోవైపు వైసిపి పార్టీని చాప చుట్టి పూర్తిగా కనుమరుగు చేసేందుకు ప్రజలందరూ సంసిద్దులుగా ఉన్నారని చెప్పారు. ఏలూరు 21వ డివజన్ శాంతి నగర్‌లో 8వ రోజు నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో అన్నివర్గాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలో టిడిపి – జనసేన కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టిడిపి – జనసేన అభ్యర్ధి బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలను ఓటు వేయమని కోరుతుంటే, మేము ఓటేయడమే కాదు 10 మందితో వేయిస్తామంటూ భరోసా ఇస్తున్నారంటే, వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికను స్వాగతిస్తున్న రాష్ట్ర ప్రజలు, ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని రీతిలో బుద్ది చెప్పాలని కంకణబద్దులయ్యారని బడేటి చంటి పేర్కొన్నారు. రోజురోజుకు తెలుగుదేశం – జనసేన కూటమికి ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్టయ్యిందని, ఇక ఆ పార్టీ తేరుకునే పరిస్థితే లేదని పేర్కొన్నారు. ఒక్క ఛాన్సంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యిందన్నారు. సొంత చెల్లెలే తన అన్నకు ఓటు వేయొద్దని కోరిందంటే జగన్ ఎటువంటి వ్యక్తో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి – జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని, ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో క్లస్టర్ ఇంచార్జ్ ఆర్.ఎన్.ఆర్ నాగేశ్వరావు,డివిజన్ ఇంచార్జ్ అట్లూరి.రామక్రిష్ణ,కేటినేడి భాస్కర్రావు,కరల కిషోర్, వై హెచ్.ఎస్. శ్రీనివాస్, వంకినేని బాబురావు,చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మలినేని బెనర్జీ, విరమచినేని పూర్ణచంద్ర, గారిమెల్లా సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.