నారాయణ పాఠశాలలో “మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్”
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక కర్నూలు నగరంలోని యెల్కూర్ బంగ్లా నందలి నారాయణ పాఠశాలలో శనివారం నాడు ఏ. జి. ఎమ్. శ్రీ రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన అంతర పాఠశాలల ఈ ఛాంప్స్ విద్యార్థులకు “మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ కార్యక్రమం” కన్నులపండుగగా జరిగింది.ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా నందికొట్కూరు మండలం ఎం. పి. డి. ఓ. శ్రీ నరేష్ కర్నూలు K. V. R. కళాశాల కు చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ శ్రీమతి ఫరీదా బేగం గారు, కర్నూలు జిల్లా నారాయణ పాఠశాలల ఏ. జి. యం. రమేష్ కుమార్ RND డిపార్ట్మెంట్ భారతి ఈ ఛాంప్స్ కో ఆర్డినేటర్ లక్ష్మి, హై స్కూల్ కో ఆర్డినేటర్ శ్రీ హరి జిల్లాకు చెందిన RI లు అన్వర్ బాషా, కొండలరావు, దుర్గాలక్ష్మి,ప్రిన్సిపాల్స్ జ్యోతి ప్రజ్జ్వలన గావించి కార్యక్రమాన్ని లాంఛన ప్రాయంగా ప్రారంభించారు.అనంతరం నారాయణ పాఠశాలల ఏ. జి. యం. శ్రీ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ఛాంప్స్ విద్యార్థులకు మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ అనే కార్యక్రమం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండే ముద్దులొలికే చిన్నారులకు వివిధ విభాగాలలో నిర్వహించడం జరిగింది అనీ, ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకై స్టోరీ టెల్లింగ్, అలాగే 1వ తరగతి నుండి 3వ తరగతి విద్యార్థులకు 4, 5 తరగతులకు స్పోకెన్ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకై వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన చిన్నారులకు బహుమతులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఈ ఛాంప్స్ ప్రిన్సిపాల్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.