ఆట పాటలతో…అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
1 min readమహిళా ఉద్యోగులందరికీ ఆటల, పాటల, క్యారమ్స్, చెస్, డాన్స్, మ్యూజికల్ చైర్ పోటీలు..
ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 2024 ఏపీజేసి అమరావతి మహిళా విభాగం ఏలూరు జిల్లా పక్షాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు 06.03.2024 వ తేదీన ఉదయం 10.00 గంటలకు స్థానిక రెవెన్యూ భవనము (ఫైర్ స్టేషన్ దగ్గర) నందు నిర్వహించబడునని, సదరు వేడుకలలో భాగముగా రేపు అనగా ది.04.03.2024 వ తేదీన స్థానిక రెవెన్యూ భవనములో ఉదయము 09.00 గ లకు మహిళా ఉద్యోగులు అందరికీ ఆటల పాటల పోటీలు (కేరమ్స్, చెస్, లేమేన్ & స్పూన్, సింగింగ్, డాన్స్, మ్యూసికల్ చైర్స్ & వక్రుత్వం పోటీలు నిర్వహించి సదరు పోటీలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి బహుమతులు ఇవ్వడము జరుగును. కావున ఏలూరు జిల్లా నందు గల ప్రతి మహిళా ఉద్యోగి రేపు జరగబోవు పోటీలలో పాల్గొనాలని అదేవిధముగ ది.06.03.2024 వ తేదీన ఉదయము 10.00 గ లకు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో తప్పక పాల్గొని సదరు కార్యక్రమము జయప్రధము చేయవలసినది ఏపీజేసి అమరావతి – ఏలూరు జిల్లా మహిళా విభాగం చైర్ పర్సన్ ఆర్.వి.బిటి. సుందరి, (9491493817) , కొ-చైర్పర్సన్ U.యామిని (9666957819), జెనెరల్ సెక్రటరీ బి. గీతిక(9705337429), అసోసియేట్ చైర్ పర్సన్ శాంతకుమారి (9494682151), స్టేట్ సెక్రెటరీ జి.జ్యోతి (6281058170), ఒక ప్రకటనలో తెలియచేసారు. సదరు పోటీలలో పాల్గొనున్న వారు పై తెల్పిన ఫోను నెంబర్లకు సంప్రదించలన్నరు.