PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిండు జీవితానికి రెండు చుక్కల 

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : చిన్నారుల నిండు జీవితానికి పల్స్ పోలియో రెండు చుక్కల మందు వేయించి చిన్నారుల చింతలేని ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడాలని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు తెలిపారు, ఆదివారం మండల వ్యాప్తంగా 4290 మంది చిన్నారులకు గాను4160 మంది చిన్నారులకు(98%) శాతం పల్స్ పోలియో వ్యాక్సిన్ వేసినట్లు వారు తెలిపారు, పల్స్ పోలియో చుక్కల మందులను 45 బూత్ లలో4 రూట్ లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, అక్కడే కాకుండా ప్రత్యేకంగా కడప- కర్నూల్ జాతీయ రహదారి కొత్త రోడ్డు పైన కూడా ఏర్పాటు చేసి అప్పుడే జన్మించిన వారితోపాటు ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందు వేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, ప్రదీప్ కుమార్ రెడ్డి, వైద్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

About Author