రాష్ట్ర లోకాయుక్త కు ఫిర్యాదు…
1 min read12 సంవత్సరాలుగా దళిత లబ్ధిదారులకు మంజూరైన భూమి స్వాధీనం కాని వైనం
పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: గత 12 సంవత్సరాలుగా 35 దళిత లబ్ధిదారులకు భూమి స్వాధీనం కానీ వైనం, కృష్ణాజిల్లా కండుపాడు ,మండలం, ప్రొద్దుటూరు దళితులకు గత 12 సంవత్సరాల క్రితం 35 మంది దళితులకు సాగు నిమిత్తం భూమి మంజూరై ఇప్పటివరకు స్వాధీనం కానీ పట్టా భూముల విషయమై ఉయ్యూరు ఆర్డిఓ లను నివేదిక కోరుతూ రాష్ట్ర ఉప లోకాయుక్త పగిడి రజిని ఉత్తర్వులుజారీ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ,కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ జనవరి 1వ తేదీ 2024న తగు చర్యలు కోరుతూ రాష్ట్ర ఉప లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఒక ప్రకటనలో. తెలియజేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం వై.యస్ రాజశేఖర్ రెడ్డి ,ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 35 మంది ప్రొద్దుటూరు గ్రామ దళితులకు సాగు నిమిత్తం కేటాయించిన, భూమిని ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు గ్రామ దళితులకు అప్పగించనందున, ఈ విషయమై కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజబాబు ఉయ్యూరు ఆర్డి.ఓ .డి .రాజుకు తన చర్యలు తీసుకోగలందులకు రాష్ట్ర లోకాయుక్త కుఫిర్యాదు చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.