ప్రజా ప్రతినిధుల ప్రశ్నలు.. అధికారుల ఉబ్బి తబ్బిబ్బు
1 min read-కరెంట్ బిల్లులు కట్టే ప్రసక్తే లేదు
-ఇబ్బందుల్లో ఉన్నా అలాగే నెట్టుకొస్తున్నాం
-తహసిల్దార్,పోలీస్,ఆర్అండ్ బి,ఆర్టీసీ అధికారుల గైర్హాజర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం వాడీ వేడీగా జరిగింది.ఉ 11:30 కు ప్రారంభమైన సమావేశం వివిధ శాఖల మండల అధికారులు మాట్లాడిన ప్రతి అధికారికీ ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక నివ్వెర పోయారు. గ్రామాల్లో విద్యుత్ కొరత ఉందని వీధిలైట్లు లేవని మీ దగ్గర ఉంటే లైట్లు ఇవ్వండని విద్యుత్ శాఖ ఏఈ క్రాంతికుమార్ తో సర్పంచ్ అన్నారు.గ్రామాల్లో నీటిని వదిలినప్పుడు కరెంటు తీసివేయాలని కరెంటు ఉండడం వల్ల ప్రజలకు నీళ్లు వెళ్ళలేకపోతున్నాయని చెరుకు చెర్ల పిఎస్ షఫీ అన్నారు. మేము సర్పంచులం అయ్యాక మీరేమో కరెంట్ బిల్లులు కట్టమంటున్నారు.గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో బిల్లులు కట్టించుకోలేదు. తర్వాత రెండు సంవత్సరాలు ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు పుష్కలంగా ఉన్నా మీరెందుకు బిల్లులు కట్టించుకోలేదు.మేము వచ్చిన తర్వాతనే బిల్లులు కట్టించుకోవాలా..అప్పుడే మీరు బిల్లులు కట్టించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా..మేమే ఇబ్బందుల్లో ఉన్నాం అయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నెట్టుకొస్తున్నాం.జిల్లా పంచాయతీ అధికారి చెప్పారు మీరు కరెంట్ బిల్లులు కట్టాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడ సంతకాలు పెట్టమన్నా మేము పెడతాం మీరే పంచా యితీని నడపండి అంటూ ప్రజా ప్రతినిధులు అధికారులపై ఫైర్ అయ్యారు.మా గ్రామ సర్పంచ్ ఉషారాణి కి ఆరోగ్యం బాగ లేకపోతే కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆరోగ్యశ్రీ చెల్లదని చెప్పడంతో లక్ష 20 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని వైస్ ఎంపీపీ నబి రసూల్ అన్నారు. గ్రామాల్లో రైతులకు ఉపయోగపడే పనులను చేయాలని పది సంవత్సరాలు గా చేసిన వాటినే చేస్తూ ఉన్నారని పొలాలకు గ్రావెల్ రోడ్డు వెయ్యమంటే వేయరని సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి అన్నారు.మీరేమో పై అధికారులను అడిగి చెబుతామని అంటారు మీరు క్రింది స్థాయి అధికారులు తప్పు చేయడం లేదా అని వారు అధికారులను నిలదీశారు.మండలానికి వచ్చే అధికారులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారా అని ఓ ప్రజాప్రతినిధి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డిఈ ఘని బాబు,సిడిపిఓ కోటేశ్వరమ్మ, సర్పంచులు మదార్ సాహెబ్, ఇందిరమ్మ,ఉషారాణి,మరియమ్మ,ఎంపీటీసీ లు ఫరీదా, కోటేశ్వరరావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.