ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబు కు లేదు
1 min readమంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడు కు లేదని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విమర్శించారు సోమవారం మండల పరిధిలోని మాధవరం తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించారు. ముందుగా వీరికి సర్పంచ్ లక్ష్మి బాయి, నారాయణ నాయక్, వీరేష్ నాయక్ లు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు నాలుగో సారి ఎమ్మెల్యే గా గెలపు నాదే అని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 14 సార్లు ముఖ్యమంత్రి గా, 40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉందని గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు. జగన్ ఒంటరిగా నే ఎన్నికల బరిలో ఉండే దమ్ము ఉందన్నారు. ఎన్నికలు వస్తాయని చంద్రబాబు నాయుడు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. చంద్రబాబు అధికారంలో కి వస్తే జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, ఎంపిడిఓ మునేప్ప, ఏపిఒ తిమ్మారెడ్డి, ఏడిఏ ఖాద్రీ, ఏఓ జీరాగణేష్, పంచాయతీ రాజ్ ఏఈ నర్సింహులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, నాయకులు మునేప్ప నాయక్ తదితరులు పాల్గొన్నారు.