2 కోట్ల 94 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలంలో జరిగిన 2 కోట్ల 94 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మంగళవారం నాడు ప్రారంభించారు. మండలంలోని పులికొండ, దూదేకొండ గ్రామలలో దాదాపుగా రూ 2 కోట్ల 31 లక్షలతో పూర్తి అయిన అభివృద్ధి పనులను పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ లాంఛనంగా ప్రారంభించారు. పులికొండ గ్రామంలో రూ38.15 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం,రూ 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ 20.84 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రూ 35 లక్షలతో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు అలాగే NREGS నిధులతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలను మండలాధికారులు గ్రామ వైసిపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే దూదేకొండ గ్రామంలో రూ38.15 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం,రూ 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గడపగడపకు మన ప్రభుత్వం నిధుల కింద 15 లక్షలతో కొండమీద ఉన్న అమ్మవారి గుడికి వరకు నిర్మించిన సిసి రోడ్డు, జలజీవన్ మిషన్ నిధుల కింద మంజూరైన 36 లక్షలతో గ్రామంలోని ఇంటింటికి కొళాయి పనులను గ్రామసర్పంచులు, నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో పత్తికొండ మండలం వైయస్సార్ పార్టీ నాయకులు, పులికొండ దూదేకొండ గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు,పంచాయతీరాజ్ అధికారులు,వ్యవసాయ అధికారులు, సచివాలయం సిబ్బంది,మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.