సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకరించాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల పరిధిలోని చిందుకూరు మరియు పెసరవాయి గ్రామాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి కలెక్టర్ శ్రీనివాసులు తనిఖీ చేశారు అనంతరం గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో గొడవలు, అల్లర్లు జరిగిన పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి భవిష్యత్తులో జరిగే పోలింగ్ లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టామని ఇందుకు గ్రామ ప్రజలందరూ ఎన్నికలలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసు వారికి సహకరించాలని తెలుయజేశారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతవాతావరణంలో. తమవిలువైన .ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.ఎవరైనా ఎన్నికల్లో అలజడులు సృష్టించిన, ప్రోత్సహించిన,పోలీస్ శాఖ కఠినచర్యలుఉంటాయనిహెచ్చరించారు.గ్రామస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.వ్యక్తిగత తగాదాలకు పోకుండా,ఘర్షణలకు పాల్పడకుండా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని,ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందుజాగ్రత చర్యలు తీసుకున్నామని, సమస్యాత్మక గ్రామాల్లో సెంట్రల్ బలగాల తో ఫ్లాగ్ మార్చ్ చెయ్యడం జరుగుతుందని, ఎన్నికల దృష్ట్యా అన్నీ కట్టుదిట్టమైన బద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.ఈ కార్యాక్రమంలో జిల్లా ఎస్పీ తోపాటు నంద్యాల టౌన్ డి.ఎస్.పి రవీంద్రనాథ్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ సిఐ వెంకటేశ్వర్లు ,గడివేముల ఎస్సై బిటి వెంకట సుబ్బయ్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.