హోళగుంద మండలంలో మేం సిద్ధం – మా బూత్ సిద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలంలో మేము సిద్ధం-మా బూత్ సిద్ధం కార్యక్రమాన్ని హోళగుంద వైకాపా మండల కన్వీనర్ షఫీ ఉల్ల, జెసిఎస్ కన్వీనర్ మలికార్జున sk గిరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆలూరు వైకాపా నియోజకవర్గ ఇన్చార్జి సోదరుడు బుసినే. శ్రీరాము లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…. హోళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లి *,(1,2.3) బూత్ వందవాగిలి(48,49,50) బూత్ లింగంపల్లి (59,60) బూత్ చిన్నహ్యట-47 పెద్దహ్యట -32 గ్రామాల్లో పర్యటించి బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని అలాగే ఆ కమిటీ ద్వారా ప్రజల్లోకి నేరుగా ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు గృహసారథులు తోపాటు బూత్ కమిటీ సభ్యులు కూడా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి వివరించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకోవాలని సూచించి, ఆలూరు వైకాపా ఇన్చార్జి శ్రీ బుసినే విరుపాక్షిని ఎమ్మెల్యేగా గెలిపించే దిశగా ముందడుగు వేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వైసిపి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, సచివాలయం కన్వీనర్స్, గృహ సారాదులు, వాలంటీర్స్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.