ఏపీలో భవిష్యత్ మనదే..
1 min readబీజేపీ రాష్ట్ర నాయకులు విట్టారమేష్, రామస్వామి
- బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో.. పలువురికి సన్మానం..
పల్లెవెలుగు, కర్నూలు: భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు పొలంకి రామస్వామి, విట్టా రమేష్, పురుషోత్తం రెడ్డి, మురహరి రెడ్డి లు అన్నారు. బుధవారం నగరంలోని బిఏఎస్ కళ్యాణ మండపంలో కర్నూలు జిల్లా బిజెపి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కన్వీనర్ రంగస్వామి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా జ్యోతి ప్రజ్వల గావించి భరతమాత, దీన్ దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం రానుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఏపీలో కూడా భవిష్యతూ మనదేనని అన్నారు.
ఘనసన్మానం…
అనంతరం విశ్వకర్మ యోజన పర్యవేక్షక సభ్యులుగా నియమితులైన కాలింగి నరసింహ వర్మ, మలేకర్ శ్రీనివాసులు కాశీవిశ్వనాథ్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే టెలికం అడ్వైజరి కమిటీ సభ్యులుగా నియమింపబడిన వెంకట హరి, మద్దిలేటి యాదవ, కటిక ప్రసాద్, మోహన్, అన్వర్ జాతీయ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ సింగం సోమశేఖర్ రెడ్డి లను బిజెపి నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, కార్యక్రమ కో కన్వీనర్ హవిలన్ బాబు, జిల్లా నాయకులు రాఘవులు, భగత్, మధు గౌడ్, వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.