NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొల్లేరు అభయారణ్య పరిధిలో అటవీ భూములను చేపల చెరువుగా మార్చకూడదు..

1 min read

ఫిర్యాదు మేరకు పైడి చింతపాడు 30 మంది అటవీ సిబ్బంది, అధికారులతో తనిఖీలు

డీఎఫ్ఓ హిమా శైలజహేమ

అటవీ సిబ్బందిని అడ్డుకున్న గ్రామస్తులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : ఏలూరు మండలం,  పైడిచింతపాడు గ్రామము నందు కొల్లేరు అభయారణ్య పరిధిలోని సుమారు 102 ఎకరాల అటవీ భూమిని చేపల చెరువులుగా మారుస్తున్నార న్న ఫిర్యాదు మేరకు ఈ రోజు అటవీ సిబ్బంది సుమారు 30 మంది పైడిచింతపాడు గ్రామం చేరుకుని, చెరువులకు నీరు నింపు పనిని ఆపే ప్రయత్నం చేయగా, గ్రామస్తులు, అటవీశాఖ సిబ్బందిని వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని వన్య ప్రాణి విభాగం డి ఎఫ్ వో హిమశైలజ తెలిపారు. ఈ ఘటనని  జిల్లా కలెక్టరు వారి దృష్టికి తీసుకు వెళ్ళగా వారు జాతీయ హరిత న్యాయస్థానము (ఎన్.జి.టి.) వారి ఆదేశాల ప్రకారం చేపల చెరువుల కార్యకలాపాలను ఆపి వేయాలని ఆదేశించారన్నారు. అటవీ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది అందరూ సదరు చెరువు ప్రాంతమును ఖాళీ చేయాలని చెప్పడం జరిగింది.డివిజినల్ అటవీ శాఖాధికారి, వన్యప్రాణి యాజమాన్య విభాగం, ఏలూరు వారు ప్రభుత్వ ఉత్తర్వలు 120 ప్రకారం వారికి సాంప్రదాయ చేపల వేట చేసుకొను హక్కు వారికి కలదని, అలా చేసుకుంటూ కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించ వలసినదిగా కోరారు. ఇంకనూ కొల్లేరు గ్రామాలలో గల పాఠశాలలు, కళాశాలలు, పంచాయితీ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కొల్లేరులో సాంప్రదాయ వేటను ప్రోత్సహించేలా గోడ పత్రికలు అతికించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలియపరచినారు.

About Author