గార్లదిన్నె విద్యార్థుల పాలిట శాపంగా మారిన రాష్ట్ర ప్రభుత్వం
1 min readఆర్ యూ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రఘునాథ్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామం లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడం వలన విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు కర్నూల్ రహదారి నందు బైటాయించి రాస్తారో చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్ యు ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ గార్లదిన్నె ఎంపీపి ఎస్ పాఠశాలలో రెగ్యులర్ టీచర్ లేక విద్యార్థులు విద్యకు దూరం రావడం జరుగుతుంది.ఈ సమస్య పైన మండల,జిల్లావిద్యాధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న విద్యార్థుల గోడు వారికి పట్టకుండా వ్యవహరిస్తున్నారనిఅవే కాకుండా టీచర్స్ లేనందువలన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను వలసలకు తీసుకెళ్లడం జరుగుతుందని. దీనిని బట్టి చూస్తే జిల్లా మండల విద్యాశాఖ విద్యార్థులను బాల కార్మికుల తయారు చేస్తున్నారని వారు విమర్శించారు.విద్యార్థులు ఎంత కష్టపడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి నోరు మేధాపకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటడం సరికాదన్నారు.ఇకనైనా రెగ్యులర్ టీచర్లు ను వేసి విద్యార్థులకు విద్యాని అందించాలిని వారు అన్నారు.లేనిపక్షంలో ఈ సమస్య పైన జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గార్లదిన్నె గ్రామస్తులు తిమ్మ గురుడు, నాగన్న, సీమోన్, షడ్రక్ తదితర గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.