PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీరు విడుదల

1 min read

ఆదినిమాయ పల్లె ఆనకట్టకు చేరని త్రాగునీరు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: వేసవిని దృష్టిలో పెట్టుకొని కడప నగరానికి త్రాగునీటి సమస్య తీర్చేందుకు వారం రోజుల కిందట మైలవరం జలాశయం నుంచి అధికారులు పెన్నా నదికి నీటిని వదలడం జరిగింది. కానీ ఇంతవరకు వల్లూరు మండలం అది నీ మాయపల్లి పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్టకు నీరు రాలేదు. సిద్ధవటం మండలం లింగంపల్లి వద్ద కడప నగరానికి త్రాగు నీటి కోసం ఏర్పాటుచేసిన పంపింగ్ స్కీం వరకు . అలాగే కడప నగరం పరిధిలో పెన్నా నది వాటర్ గండి పంపింగ్ స్కీం వరకు నీటి సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుతం పెన్నా నది జనవరి 25వ తేదీ నుంచి పూర్తిగా ఎండిపోయింది. దీని కారణంగా త్రాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని వదిలారు కానీ వచ్చిన నీరంతా పెన్నా నదిలో ఇంకిపోతున్నది. పెన్నా నది నుంచి ఇష్టానుసారంగా ఇసుక తరలిస్తుండడంతో పెన్నా నదిలో నీటి ప్రవాహం ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పెన్నా నది ఎగువ భాగంలో గండికోట. మైలవరం జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ పెన్నా నదికి ఎక్కువ శాతం నీటిని వదలడం లేదు. కడప నగరానికి తాగునీటి అవసరాల కోసం కర్నూలు జిల్లా బనగానపల్లి సమీపంలో అవుకు రిజర్వాయర్ లో నీటి నిల్వ ఉంచి అవసరాల కోసం కడప నగరానికి వదలవలసి ఉంది. కానీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

About Author