బేటి పడవో బేటి బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
1 min read.. ఏ సి డి పి ఓ . పద్మావతి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : బాలికలకు 15 సంవత్సరాల వరకు విద్య అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆడపిల్లను చదివించు ఆడపిల్లను రక్షించు అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలనే దిశగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు గురువారం నాడు గడివేముల మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో అడిషనల్ సిడిపిఓ పద్మావతి సూపర్వైజర్లు జయలక్ష్మి కళావతిల ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు ఆశా వర్కర్లు మరియు జి ఎం ఎస్ కే సిబ్బందికు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో బాలికలకు డ్రాపౌట్స్ లేకుండా చూడాలని ఆడపిల్లల రక్షణ కోసం చట్టాలను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు లైంగిక నేరాలు జరగకుండా అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు పిల్లలకు రక్తహీనత కలుగకుండా వారి ఆరోగ్యం పై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని వారి హక్కులపై అవగాహన కల్పించాలని తెలిపారు అనంతరం గడిగరేవుల గ్రామంలో విద్యార్థిని విద్యార్థులతో బేటి పడావో బేటి బచావ్ అనే నినాదం ఉన్న పోస్టర్‌తో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న జి ఎం ఎస్ కే సిబ్బంది ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.