జూనియర్ లాయర్లకు సాయం అందించండి : సీజేఐ
1 min readపల్లెవెలుగు వెబ్ : హైకోర్టుల్లో జడ్జిల పోస్టుల భర్తీ పై కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ ఎన్వీ రమణ లేఖ రాశారు. కొలీజియం సిఫార్సుల పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్నవారిని కరోన యోధులుగా గుర్తించాలని కోరారు. కోర్టు సిబ్బంది కుటుంబ సభ్యులకు కరోన టీకా వేయించాలని, కరోనతో ఉపాధి కోల్పోయిన జూనియర్ లాయర్లకు సాయం అందించాలని కోరారు. జాతీయ న్యాయ, మౌళిక వసతుల కార్పొరేషన్ ఏర్పాటు తుది దశలో ఉందని, నివేదిక సిద్దమైన తర్వాత కేంద్రానికి సమర్పిస్తామని సీజేఐ తెలిపారు.