మహిళా సాధికారత కోసమే నేడు మహిళా దినోత్సవ వేడుకలు..
1 min readపురుషులతోపాటు మహిళలకు కూడా సమానత్వం, సమాన వేతనం ఇవ్వాలి..
జిల్లాజడ్జి జి రాజేశ్వరి మహిళా దినోత్సవ
శుభాకాంక్షలు తెలిపిన ఏలూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏలూరులోని ఐదవ అదనపు జిల్లా జడ్జీ మరియు మహిళా కోర్టు న్యాయమూర్తి జి. రాజేశ్వరి ని ఆ జిల్లాకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు, ఏలూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నక్కా నాగరాజు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ టి.సుబ్బారావు, యువన్యాయవాది రవి (పండు)లు కలిసి పుష్ప గుచ్ఛం, స్వీట్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐదవ అదనపు జిల్లా జడ్జీ మరియు మహిళా కోర్టు న్యాయమూర్తి జి. రాజేశ్వరి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం గురించి వివరించారు. సమాజంలో మగవారికి ఎక్కువ జీతం, ఎక్కువ విలువ ఎలా ఇస్తున్నారో మహిళలకు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా వారితో సమానంగా జీతాన్ని, విలువను,గుర్తింపును ఇవ్వాలని,లింగ సమానత్వం ఉండాలనే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రపంచంలో మహిళల పట్ల ఉన్న వివక్షను తగ్గించేందుకు, మహిళా సాధికారత సాధనకోసమే ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపు కుంటున్నామని జిల్లా జడ్జి రాజేశ్వరి తెలిపారు.