ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
1 min readమహిళలు పట్టుదల, కృషితో ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు
పల్లెవెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏపీజేఏసి అమరావతి మహిళా విభాగం ఏలూరు జిల్లా వారి ఆద్వర్యములో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును బుధవారం స్థానిక రెవెన్యూ భవనము నందు గనంగా నిర్వహించడము జరిగినది. సదరు కార్యక్రమమునకు నిర్మల జ్యోతి, డిప్యూటీ CEO, జిల్లా ప్రజా పరిషద్, ఏలూరు, మంజు భార్గవి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల కార్పోరేషన్, ఏలూరు జిల్లా వారు మరియు ఉదయభాను, మెడికల్ ఆఫీసర్, ఏపీఎస్ ఆర్టిసి ఏలూరు, ముఖ్య అతిధులు గా పాల్గోన్నారు. కార్యక్రమములో అతిధులు మాట్లాడుతూ మహిళా స్వేచ్చ, స్వతంత్రము, సమానత్వము వివరించి మహిళా సాధికారత గురించి మరియు మహిళా ఉద్యోగిణిలు వారి వారి ఉద్యోగములలో విజయవంతముగా రాణించాలని అనేక ఉన్నత స్థానములు సంపాదించాలన్నరు. ఇక్కడకు విచ్చేసిన మహిళలందరూ వివిధ రంగాలలో ఉన్నతాధికారులుగా రాణిస్తున్నారంటే కేవలం వారి పట్టుదల, ప్రతిభ, నిబద్ధతతో ముందుకు సాగారని కొనియడారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరన్న ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతున్నారని తద్వారా ఆయా రంగాలలో విజయం సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానముగా అన్ని రంగములలో ముందడుగు వేస్తున్నారని మరియు మహిళలు అన్ని స్థానములలో ప్రప్రధమ స్థానములు సాధించాలని కొనియాడారు. ఈ కార్యక్రమములో మహిళదినోత్సవము పురస్కరించుకొని మహిళా ఉద్యోగుణి లకు జరిగిన ఆటల, పాటల పోటిలలో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందించడము జరిగినది. ఏపీజేఎసి అమరావతి ఏలూరు జిల్లా మహిళా విభాగం చైర్పెర్సన్ ఆర్.వి.బి.టి. సుందరి, కొ-చైర్పర్సన్ U.యామిని, జెనెరల్ సెక్రటరీ బి. గీతిక, అసోసియేట్ చైర్ పర్సన్ శాంతకుమారి, స్టేట్ సెక్రెటరీ జి.జ్యోతి, ట్రెజరర్ భష్రి, సెక్రటరీ ఝాన్సీ లక్ష్మి భాయ్ మరియు వివిధ శాఖల ఉద్యోగిణి లు కార్యాలయాల సిబ్బంది పాల్గోనారు.