కుల…మతాలకు అతీతంగా సేవ చేస్తాం.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readసాయిబాబా నగర్‌లో చర్చిని ప్రారంభించిన టి.జి భరత్
రూ. 7 లక్షలు వెచ్చించి చర్చి నిర్మాణంలో భాగస్వామ్యమైన టి.జి.వి గ్రూప్స్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లో కులం, మతం చూడకుండా ప్రతి ఒక్కరికీ తమ టిజివి గ్రూప్స్ తరుపున సహాయం చేస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. 52వ వార్డు పరిధిలోని సాయిబాబా నగర్లో నూతనంగా నిర్మించిన క్రీస్తు సంఘం మందిర ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలందరితో కలిసి ప్రార్థన చేసి చర్చిని ప్రారంభించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ చర్చి నిర్మాణంలో రూ.7లక్షలు వెచ్చించి తమ టిజివి సంస్థల తరుపున భాగస్వామ్యం అవ్వడం తన అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులు ఉంటేనే ఇలాంటి సహాయ సహకారాలు అందిచగలుగుతామన్నారు. ప్రజలు కూడా నిస్వార్థంగా సేవ చేసే తమను ఆశీర్వదించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఓటు వీరికే వేయాలని బైబిల్ పట్టుకొని వచ్చినా, పాస్టర్లు, ఫాదర్లు చెప్పినా ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించి మంచి వ్యక్తికి ఓటు వేయాలన్నారు. ఎలాంటి అధికారం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న తమకు అధికారం ఇస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసే వీలుంటుందన్నారు. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు ఆనందరావు, క్రీస్తు సంఘ సేవకులు ప్రసాదరావు, ఇబ్రహీం పట్నం క్రీస్తు సంఘ సేవకులు విజయరావు, రాజ్ కుమార్, సురేంద్ర, కె. రాజ్ కుమార్, నాగరాజు, సుదర్శనం, పాస్టర్ రాజు, వీరశైవ సాధికార కమిటీ నాయకులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.