మోకాళ్ళ నొప్పులకు ఉత్తమమైన వైద్యం ఆక్యుపంచర్ సైన్స్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం ఆక్యుపంక్చర్ కాలేజ్ నందు మోకాళ్ళ నొప్పులు పై ఉచిత అవగాహన సదస్సు మరియు చికిత్స మహాశివరాత్రి పండుగ సందర్భంగా అందించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా 50 మంది వరకు పాల్గొన్నారు.ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాణశక్తి చికిత్స అనేది వైద్యం అందని ప్రాంతాలలో కూడా ఎవరికి వారు వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా అనారోగ్యం తగ్గించుకునే విధంగా అందరూ అవగాహన పొందాలని చెప్పారు. ఇది భారతదేశంలో ప్రతి మూల ప్రాంతాలకి వైద్యం దొరకని ప్రాంతాలకు వెళ్లాలని కొరారు. మోకాళ్ళ నొప్పులకు యూబీ 40 అనే నాడీ కేంద్రం వద్ద ఒత్తిడి చేయడం ద్వారా నొప్పులను తగ్గించవచ్చని ,అరుగుదల వచ్చినటువంటి ఎముకలను పునరుద్ధరణ చేయడానికి యుబి 11 అనే మెడ వెనుక ప్రాంతంలో ఉన్న నాడీ కేంద్రం ఒత్తిడి చేయడం ద్వారా తిరిగి పునరుద్ధరింప చేయవచ్చని. చెప్పనారు.చికిత్స విధానం ద్వారా మందులు లేని భారత సమాజం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ యొక్క చికిత్స ని అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆస్పభారత్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అలవాల రవి , బ్రీతింగ్ యోగ సాధకులు విజయ్ సాయి రామ్ ,సుమతి ఇతర తెరపిస్టులు పాల్గొన్నారు.