జగన్ ప్రభుత్వానికి ఇక సమాధే! : డా. మాచాని సోమనాథ్
1 min readటిడిపి తోనే బీసీలకు పెద్ద పీఠ
మిలటరీ కాలనీలో.. బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పై ఇంటింటి ప్రచారం నిర్వహించిన డాక్టర్ మాచాని సోమనాథ్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో బీసీలను అనేక రకాలుగా వేధించి, దాడులు చేసి, హత్యలు చేయించిన జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో సమాధి చేసే సత్తా బీసీలకు ఉందని, టిడిపి తోనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నడానికి జయహో బీసీ సభలో టిడిపి అధినేత ప్రకటించిన బీసీ డిక్లరేషన్ తోనే మరో సారి స్పష్టంగా రుజువైందని టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ తెలిపారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలో.. మిలిటరీ కాలనీ నందు బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పై ఇంటింట ప్రచారం నిర్వహించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మిలిటరీ కాలనీలో.. శ్రీ శ్రీ నెట్టికంట సీతారామాంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 34 శాతములో 10 శాతం కోత పెట్టి 24 శాతమునకు పరిమితం చేయడంతో 16800 బీసీలు పదవులు కోల్పోయారని ఆవేదన చెందారు. జయహో బీసీ సభలో చంద్రన్న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చూస్తుంటే బీసీల ఆత్మగౌరవానికి నాంది పలికిందన్నారు. బీసీలకు 50 ఏళ్ల వయసుకే 4000 పెన్షన్ మంజూరు చేయడమే కాకుండా, బీసీలపై సామాజిక దాడులు జరగకుండా నిలువరించేందుకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించడం అభినందనీయమన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చట్టబద్ధంగా కులగలనుతోపాటు, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు, విద్యాపథకాల పునరుద్ధరణ, ఏడాదిలోపు బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు, బీసీల ఆర్థిక అభివృద్ధికై ఉపాధి ప్రోత్సహకాల నిమిత్తం జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, దామాషా ప్రకారం నిధులు కేటాయింపు, 10 వేలకోట్ల తో స్వయం ఉపాధి పథకాలు, 5 వేల కోట్లతో ఆదరణ పథకాలు అందించడానికి నిర్ణయం తీసుకొని బీసీ 153 కులాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందించడానికి చంద్రబాబు నిర్ణయం హర్షనీయమన్నారు. బీసీలు ఐక్యమత్యంతో ఉండి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం టిడిపి కురువ సాధికారిక కమిటీ సభ్యులు అడ్వకేట్ కేటి మల్లికార్జున, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇప్పె నరసప్ప, కే యం డి అబ్దుల్ జబ్బర్, రోజా ఆర్ట్స్ ఉసేని, తెలుగు మహిళా నాయకురాలు గోకారమ్మ, చేనేత విభాగం నాయకులు లక్ష్మి రెడ్డి, కామర్తి గంగాధర్, సుడిగుండు శ్రీనివాసులు, ధన, రంగస్వామి, శేఖర్, వెంకటేష్ , టిడిపి మైనార్టీ నాయకులు గోరా భాష, జోహార్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.