సబ్‌కలెక్టర్ ఛాంబరు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో : కడప సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఇటీవల నిర్మించిన సబ్ కలెక్టర్ చాంబరు మరియు సమావేశ హాలును శనివారం జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం. గౌతమి లు సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. సమావేశ హాలుకు సర్ థామస్ మన్రో పేరును నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా చాంబరును మరియు సమావేశ హాలును పరిశీలించి అందులో ఉన్న సీటింగ్, ఇతర సౌకర్యాలు, విశాలమైన సమావేశ హాలు నిర్మించడం పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు.
అలాగే ఆవరణలో ఏర్పాటు చేసిన పూల మొక్కలు, ఇతర గ్రీనరీ ఆహ్లాదకరంగా ఉన్నాయని వాటిని ఏర్పాటు చేయించిన సబ్ కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో కలెక్టర్ జేసీలు, సబ్ కలెక్టర్ తదితరులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సీఎం సాయి కాంత్ వర్మ, హెచ్ఎం. ధ్యానచంద్ర, సబ్ కలెక్టర్ ఐ. పృథ్వి తేజ్, తాసిల్దార్ శివరాం రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.