వందల కోట్లు ఖర్చు చేస్తే అభివృద్ధి ఏది..?: టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
1 min readచిత్తారి వీధిలో సమస్యలు మొరపెట్టుకున్న ప్రజలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తే.. ప్రజలు సమస్యలతో ఎందుకు సతమతమవుతారని అధికార పార్టీ నేతలను కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రశ్నించారు. నగరంలోని 5వ వార్డు చిత్తారి వీధిలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం ఆయన చేపట్టారు. వార్డుకు వచ్చిన టీజీ భరత్‌కు ప్రజలు వారి సమస్యలు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న నాయకులు అభివృద్ధి ఏం చేయలేదన్నారు. సరైన నాయకుడు పాలకుడిగా లేకపోతే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయన్నారు. పదేళ్లుగా తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తునే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. రాబోయే ఐదేళ్లలో తాను చేయబోయే అభివృద్ధి ప్రజలకు 20 ఏళ్లపాటు మంచి జీవితాన్ని ఇస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీరు, కుళాయిలు, విద్యుత్ వైర్లు, డ్రైనేజీ సమస్యలు అన్ని పరిష్కస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాలు, చెన్నారెడ్డి, రాజ్యలక్ష్మి, విజయ లక్ష్మి, సురేష్, ఇంద్రజ, జనసేన నాయకులు శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.