మహానంది క్షేత్రంలో కన్నుల పండుగగా రథోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల రథోత్సవం జరిగింది. క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక పూజలను శాస్త్ర యుక్తంగా వేద మంత్రం చరణాలు మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నంది వాహనంపై ఆలయ మాడవీధుల గుండా భక్తులకు దర్శనమిస్తూ ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం రథశాల యందు రధాంగాని ప్రత్యేకంగా అలంకరించి రధాంగ హోమం గణపతి పూజ పుణ్య వాచనం రథంగా బలి బలిహరణ తదితర ప్రత్యేక పూజలను నిర్వహించి రథం ముందు భాగాన కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి రధాన్ని రథోత్సవానికి సిద్ధం చేశారు. అనంతరం నూతన వధూవరులైన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పీఠములో మంగళ వాయిద్యాలతో రధశాల వద్దకు తీసుకొని వచ్చి అక్కడ కూడా కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి రథము యందు ఆసీనులు గావించారు. అనంతరం నంద్యాల ఆర్డీవో మల్లికార్జున్ రెడ్డి మండల తాసిల్దార్ రామచంద్రుడు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి నంద్యాల కు చెందిన మార్కెట్ ప్రసాద్ పలువురు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. శివనామస్మరణతో భక్తులు మేళ తాళాలు మంగళ వాయిద్యాల మధ్య రథాన్ని ఆలయ మాడ వీధుల గుండా భక్తి పార్యవశ్యంతో లాగుతూ ఊరేగించుకుంటూ తమ భక్తిని చాటుకుంటూ స్వామి అమ్మవార్ల సేవలో తరిస్తూ రథశాల వద్దకు తీసుకొని వచ్చి యధా స్థానంలో నిలిపారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రథోత్సవం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపించుకున్నారు. ఇన్ని శాఖల సంయుక్త సహాయ సహకారాలతో మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించామని ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు మధు ,వెంకటేశ్వర్లు ఆలయ వేదసిఐ శివ కుమార్ రెడ్డి మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ సిఐ శివ కుమార్ రెడ్డి మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్ భట్ ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.