శవానికి పింఛన్
1 min readవిజయనగరం; విజయనగరం జిల్లాలో శ్రీనాథ్ అనే వలంటీర్ అత్యుత్సాహానికి అంతులేకుండా పోయింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి వేలిముద్రలు తీసుకుని ఆమెకు ఫించన్ మంజూరు చేశారు. ఒకవైపు బాధతో బంధువులు రోధిస్తుంటే…వలంటీర్ వేలిముద్రలు తీసుకుని శవానికి పింఛన్ అందించాడు. రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశం అయింది. అధికారుల మెప్పుకోసమే వలంటీరు ఈ విధంగా వ్యవహరించాడని పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలు పనిచేయవనే ఇంగితం కూడ లేకుండా వలంటీరు వ్యవహరించాడని విమర్శించారు. ఈ ఘటన మీద ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.