కమనీయం..బుగ్గరామేశ్వరుని రథోత్సవం
1 min readరథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్లు: మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గలో ఆదివారం సాయంత్రం 6 గం.కు శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది.సాయంత్రం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై దేవాలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.రథోత్సవాన్ని ప్రత్యేకంగా పూల అలంకరణ మరియు దేవాలయాన్ని అలంకరించారు. హుసేనాపురం,గుట్టపాడు,పాలకొలను,కాల్వ, సోమయాజుల పల్లె,కొమరోలు,చింతలపల్లె వివిధ గ్రామాల ప్రజలు బంధువులు అధిక సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని తిలకించారు. దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా టెంకాయలు కొడుతూ మహిళలు మరియు ప్రజలు పూజలు చేశారు.కబడ్డీ పోటీల్లో మొదటి స్థానంలో కర్నూలు జట్టు 25 వేల రూపాయలు విజేతగా నిలిచింది.రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ కిరణ్ కుమార్ రెడ్డి,ఓర్వకల్లు ఎస్ఐ ఎం రాజారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ డిఎస్పీ భవాని,ఏఎస్ఐ శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఆలయ కార్య నిర్వహణ అధికారి డిఆర్ కెవి ప్రసాద్,ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సోమవారం ఉదయం రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు ప్రారంభం అయ్యాయి.