స్మశాన వాటికల కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదించిన కృష్ణా జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు : కృష్ణాజిల్లాలోని స్మశాన వాటికలు లేని దళితవాడల్లో భూమిని సేకరించి స్మశాన వాటికల కేటాయింపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజబాబు ప్రతిపాదన సమర్పించారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసిస్టెంట్ సెక్రటరీ ముత్యాలరాజు డి 17- 9 -2022న రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు వ్రాసిన లేఖ మేరకు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణరెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఈ ప్రతిపాదన లను ప్రభుత్వానికి సమర్పించారు అని, కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ కుమ్మమూరు దళితవాడకు స్మశాన వాటిక మంజూరు విషయమై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డికి ది 6 -7 -2023న ఫిర్యాదు చేయడం జరిగిందని, ఒక ప్రకటనలో తెలియజేశారు. తోట్లవల్లూరు మండలం కొమ్మమూరు గ్రామ దళితవాడకు స్మశాన వాటిక కేటాయింపు విషయమై లోకాయుక్త సమర్పించిన నివేదికలో కృష్ణాజిల్లా కలెక్టర్ జిల్లాలోని స్మశానవాటికలు లేని 50 దళితువాడలో 52 ఎకరాలు ,45 సెంట్లు ,భూమిని సేకరించాలని అందునిమిత్తం 28 కోట్లు 30 లక్షలు నిధులు కేటాయించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కుప్రతిపాదనలు సమర్పించారు. తోట్లవల్లూరు మండలం కొమ్మమూరు, తోపాటు బొడ్డపాడు భద్రిరాజుపాలెం, గరికపర్రు, గుర్వివిందపల్లి, గ్రామాలలో స్మశాన వాటిక నిమిత్తం జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. కృష్ణాజిల్లాలో 50 అయితే,పామర్రు నియోజకవర్గంలోని 21 గ్రామాల్లో స్మశాన వాటికల నిమిత్తం ప్రతిపాదనలు ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ సమర్పించడం జరిగిందని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలియజేశారు.