నందికొట్కూరులో టీడీపీ పతనం ఖాయం
1 min readగ్రూపు రాజకీయాలే టీడీపీ ఓటమి..
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.
నందికొట్కూరు లో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పతనం ఖాయమని ఆ పార్టీ గ్రూపు రాజకీయాల వలనే ఓటమి చెందుతుందని రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.నందికొట్కూరు పట్టణంలోని శివశంకర్ సినిమా థివేటర్ సమీపంలో నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ,నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. ధారా సుధీర్ ప్రారంభించారు. ఉదయం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండటం కోసమే వైసీపీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరు కలిసి కట్టుగా వైసీపీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. నందికొట్కూరు లో టీడీపీలో నాయకత్వం లోపించింది. నాయకత్వ లోపమే టీడీపీ పతనానికి కారణమన్నారు. టీడీపీలోని గ్రూపు రాజకీయాలు వలనే 20ఏళ్ళు టీడీపి ఓటమి చెందుతుందన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ పూర్తిగా కనుమరుగై పోతోందని జోస్యం చెప్పారు. ఒక శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే టీడీపీ తప్పిదామన్నారు.బీజేపీ పొత్తుతో కార్యకర్తల ఆత్మాభిమానాన్ని మోడీ కి టీడీపీ తాకట్టు పెట్టిందని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.