ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టం కట్టండి
1 min readటిడిపి హాయంలోనే..చేనేతల సంక్షేమం పథకాలు పుష్కలంగా అందుతాయి డాక్టర్ మచాని సోమనాథ్ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో.. తేరు బజార్, మల్లారి వీధులలో “బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ”పై ఇంటింటా ప్రచారం నిర్వహించిన డాక్టర్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టి ఆదరించి “రాక్షస పాలన” ను అంతమొందించాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో 2 వ వార్డు,తేరు బజార్, సందుగుడి, గంగమ్మ బావి,మల్లారి వీధులలో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీపై ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చేనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చేనేతల కోసం దేశంలోనే మొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు తన హాయంలో ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్స్ సిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వెంకటగిరిలో.. రూ.300 కోట్లతో సిల్క్ పరిశ్రమను ఏర్పాటు చేసి, త్రిఫ్ట్ హాబిట్ 8 శాతమును 16 శాతం కు పెంచి నైపుణ్య, శిక్షణ, మార్కెట్ కు అనుగుణంగా ఉత్పత్తుల సాధనకు రూ.10 కోట్లతో.. శిక్షణ ఇచ్చారన్నారు. చేనేతలకు పావలా వడ్డీ రుణాలతో పాటు సబ్సిడీలతో 12 పథకాలు అమలు చేసి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.50 వేలు లబ్ధి చేకూర్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నూలు, రంగులు, రసాయనాలపై ఉన్న సబ్సిడీని 10 శాతం నుండి 40 శాతమునకు పెంచి చేనేతలకు చంద్రన్న ఎంతో మేలు చేశాడని తెలిపారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో చేనేతలు అధికంగా ఉన్నారని గమనించిన చంద్రబాబు నాయుడు చేనేతలను ఆదుకునేందుకు బనవాసి గ్రామంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు 91.31 ఎకరముల భూమిని కేటాయిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి చేనేతలకు అన్యాయం చేశారని ఆవేదన చెందారు. జగన్ ఐదేళ్ల పాలనలో.. 20% మందికే నేతన్న నేస్తం అందిందని దుయ్య పడ్డారు. చేనేతలు మరోసారి మోసపోకుండా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, కే.యం.డి అబ్దుల్ జబ్బర్, రోజా ఆర్ట్స్ ఉసేని, చేనేత విభాగం నాయకులు, కామర్తి గంగాధర్, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు కంపాడు చిన్న రంగన్న, వన్నెల మోష, ఆఫ్గన్ వలి భాష,6 వ వార్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు.