పంచాయతీ సెస్ ల తోనే గ్రంధాలయాల అభివృద్ధి
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు : గ్రామ పంచాయతీ లు ఇచ్చే సెస్ ల నిధుల తోనే గ్రంధాలయాల అభివృద్ధి కి ఖర్చు చేయడం జరుగుతుందని , కావున జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీ లు సెస్ సక్రమంగా చెల్లించిన యెడల గ్రంధాలయాల అభివృద్ధి కి వారు తోడ్పాటు అందించినట్లు అవుతుందని గ్రంధాలయాల జిల్లా కార్యదర్శి కిషోర్ తెలిపారు. వెలుగోడు పట్టణంలో ని గ్రంధాలయాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్ల సెస్ నిధులు గ్రామ పంచాయతీ లు బకాయి పడ్డారని అన్నారు. జిల్లా లో గ్రంధాలయాల కు 50 శాతం మేరకు లైబ్రేరి ల ఖాళీలు ఉన్నాయని , కొన్ని వాటికి ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో గ్రంధాలయాల ను నడుపుతున్నామని అన్నారు.జిల్లా లో 10 భవనాల నిర్మాణాలు జరుగు తున్నాయని చెప్పారు. ఇంకా 20 వరకు గ్రంధాలయాలు బాడుగ భవనాలలో కొనసాగుతున్నాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిణి సుమలత పాల్గొన్నారు.