సీఎం జగనన్న పాలనలో ప్రజలంతా క్షేమం
1 min readరాబోయే ఎన్నికల్లో దేవుని దీవెనలతో ప్రజల ఆశీస్సులతో 175/ 175 ఖచ్చితంగా గెలుస్తాం
హోళగుంద మండలంలో శ్రీ బుసినే విరుపాక్షి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం హెబ్బటం, ఇంగలదహాల్, కొత్తూరు, పెద్ద గోనెహాల్ గ్రామాల విస్తృత పర్యటనకు విచ్చేసిన ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ బుసినే విరుపాక్షి కి ఘన స్వాగతం పలికిన ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు హెబ్బటం గ్రామంలో మండల, గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి గడపగడపకు వెళుతూ నన్ను ఒక్కసారి ఆదరించమని ఆశీర్వ దించమని కోరుతూ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మహానేత దివంగత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో శ్రీ బుసినే విరుపాక్షి మాట్లాడుతూ సీఎం జగనన్న పాలన ఒక చరిత్ర, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పాలనను ఈ 58 నెలల కాలంలో చేసి చూపించిన ఘనత ఒక్క సీఎం జగనన్నకే సాధ్యం అని బుసినే విరుపాక్షి అన్నారు . ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపించిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న మాత్రమే అని బుసినే విరుపాక్షి అన్నారు . రాష్ట్రంలో 30 లక్షల మంది అక్కాచెల్లెల్లెమ్మలకు సొంత ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఏకైక సీఎం జగనన్న మాత్రమే అని విరుపాక్షి గారు అన్నారు . రాష్ట్రంలో రైతులు ఏ ఇబ్బంది పడకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇచ్చిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్న మాత్రమే అని బుసినే విరుపాక్షి అన్నారు .ఈ ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది నా కల అని శ్రీ బుసినే విరుపాక్షి అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అనేది నా ఆశయం .ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి నన్ను ఒక్కసారి మీ బిడ్డగా ఆశీర్వదించమని అడుగుతున్నాను అని బుసినే విరుపాక్షి అన్నారు . నేను ప్రజాసేవ చేయడానికే వచ్చాను, నాకు డబ్బు మీద ఆశ లేదు, ప్రజల లక్ష్యం కోసమే పని చేస్తానని బుసినే విరుపాక్షి అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కుటుంబ సభ్యులు జిల్లా జేసిఎస్ కో-ఆర్డినేటర్ శ్రీ తెర్నేకల్ సురేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ జేసిఎస్ కో-ఆర్డినేటర్ శ్రీ ఓబులేష్ గారు, జెడ్పీటిసి శేషప్ప గారు, ఎంపీపీ ఈషా , మండల కన్వీనర్ షఫీ ఉల్లా , వైస్ ఎంపీపీ గారు, కో -కన్వీనర్ రవికుమార్ ,SK గిరి , ప్రహల్లాద రెడ్డి , వెంకటరెడ్డి, వెంకట్రామిరెడ్డి, జేసిఎస్ మండల ఇంచార్జ్ మల్లికార్జున, రామకృష్ణ,ముద్దట మాగి వెంకటేష్, హనుమప్ప, ముక్కర నందీష్, మరియు సచివాలయ కన్వీనర్లు, రైతు సంఘం అధ్యక్షులు, విద్యా కమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్లు, గృహ సారథులు, నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .