PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ తీసుకోని వారిలో డెల్టా వైర‌స్ ఎఫెక్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: వ్యాక్సిన్ తీసుకోని వారిలో డెల్టా ర‌కం వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రక‌టించింది. మిగిలిన వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్ ప్రమాద‌క‌రంగా ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్​ఓ తెలిపింది. దాదాపు 85 దేశాల్లో డెల్టా వేరియంట్ ను క‌నుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిప‌తి టెడ్రోస్ అధ‌నామ్ ప్రక‌టించారు. డెల్టా వైర‌స్ ప‌ట్ల ప్రపంచ దేశాల్లో ఆందోళ‌న వ్యక్తమ‌వుతున్నట్టు సంస్థ డైరెక్టర్ జ‌న‌రల్ గెబ్రెయేస‌న్ పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో కోవిడ్ నిబంధ‌న‌లు సడ‌లించ‌డం ప్రమాద‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెర‌గ‌డం మొద‌లైంద‌ని, కేసుల పెరిగే కొద్ది ఆస్పత్రిల్లో చేరేవారిసంఖ్య , మ‌ర‌ణాల ముప్పు కూడ పెరుగుతుంద‌ని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని ర‌కాల సాధ‌నాల‌ను ఉప‌యోగించాల‌ని చెప్పారు.
వ్యాక్సిన్ పొందిన వారికి మాస్క్ త‌ప్పనిస‌రి :
వ్యాక్సిన్ పొందిన వారు కూడ మాస్క్ త‌ప్పనిస‌రి ధ‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్వో ప్రక‌టించింది. కోవిడ్ నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాల‌ని తెలిపింది. వ్యాక్సిన్ పొందిన వారు స‌రైన జాగ్రత్తలు పాటించ‌క‌పోతే వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతార‌ని డ‌బ్ల్యూహెచ్వో ప్రక‌టించింది.

About Author