ఎండల పట్ల జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రమంగా వేడెక్కుతుందని ఎండల ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని జర్నలిస్టులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార కార్యాలయంలో జర్నలిస్టులకు టోపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏప్రిల్ నెలలో ఎండలో 40 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం ఉందని ద్రోని, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు పొగ మంచు కురవడం కారణమన్నారు. ఈ ఏడాది రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే 3-5 డిగ్రీలు అధికంగా రికార్డు అయ్యాయని, ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. జర్నలిస్టులు ఎండల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ మధ్యాహ్నం సమయంలో తలకు టోపీ పెట్టుకోవాలనరు.