సీనియర్ అసిస్టెంట్ ను ప్రభుత్వ సర్వీస్ నుండి డిస్మిస్ చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు : కృష్ణాజిల్లానగర పంచాయతీ ,పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలలో నిధులను దుర్వినియోగం చేసి, రికార్డులను మాయం చేసి, విధులను సరిగా నిర్వర్తించని జూనియర్ అసిస్టెంట్ కె. చెన్నకేశవరావు పై ఒక ఇంక్రిమెంట్ మాత్రమే నిలుపుదల చేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ రూల్స్ 1991 ప్రకారం మేజర్ పెనాల్టీ విధించాల్సి ఉంది ,తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ లోనే కాకుండా కృష్ణాజిల్లా ఉయ్యూరు పంచాయతీలో రికార్డులు ట్యాంపరింగ్ చేసి ,మాయం చేసిన సంఘటనలో కె .చెన్నకేశవరావు సస్పెండ్ కావడం జరిగింది. ఉయ్యూరు నగర పంచాయతీ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలలో నిధులు చెన్నకేశవరావు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఋజువైనందున, ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించటానికి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి వై. శ్రీలక్ష్మి కి లోకాయుక్త కి వినతిపత్రం సమర్పించడం జరిగిందని ,సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ఒక ప్రకటన తెలియజేశారు.