జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కర్నూల్ నగరంలోని జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ నందు గురువారం ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సి.బి.పి, ఆర్.బి.ఎస్, సీరం క్రియాటినిన్ , సి.యూ.ఈ, నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్,ఫిజీషియన్ కన్సల్టేషన్ ఉచితంగా చేయబడ్డాయి దాదాపు 500 మంది క్యాంపు ద్వారా చికిత్స పొందారు. అలాగే జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ నందు దీర్ఘకాలికమైన కిడ్నీ వ్యాధికి చికిత్స పొంది నయమైన రోగులు హాస్పిటల్ వైద్యులుకు వైద్యులు నయమైన రోగులకు సన్మానం చేయడం జరిగింది. దీర్ఘకాలికమైన కిడ్నీ వ్యాధి తో నయమైన రోగులకు ఫుడ్ కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఎండి,సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్, నెఫ్రాలజిస్ట్ నిపుణులు డాక్టర్ రవికుమార్ మహంకాళి మాట్లాడుతూ అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఉచిత కిడ్నీ క్యాంపుకు విశేష స్పందన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మార్చి నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 3199 రూపాయలు విలువ చేస్తే కిడ్నీ పరీక్షలను కేవలం 599 రూపాయలకే చికిత్స చేయడం జరుగుతుందని భవిష్యత్తులో జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమంలు చేస్తామని తెలిపారు.