జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం పైలాన్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో జగన్నాథ గట్టు పై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్లతో నిర్మించనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పైలాన్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి జి.సత్య ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి,కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బివై.రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ విజయ మనోహర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డా జి.సృజన మాట్లాడుతూ రాయలసీమ ఆకాంక్షకు ప్రతీకైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి కర్నూలు జిల్లా ప్రజలందరి తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నానన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. సుమారు 150 ఎకరాల్లో స్థాపితం అవ్వబోతున్న న్యాయ విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో ఒక మచ్చు తునకగా ఉండబోతుందని తెలియజేయటానికి సంతోషిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి సూచనలతో న్యాయ విశ్వవిద్యాలయం పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. తొలుత జగన్నాథ గట్టు పై ఏర్పాటు చేయనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పైలాన్ ను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ డా జి.సృజన రాష్ట్ర ముఖ్యమంత్రి కి జగన్నాథ గట్టు పై ఏర్పాటు చేయనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ ఏర్పాట్ల గురించి వివరించారు.తదనంతరం ప్రజారోగ్య మరియు పురపాలక సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో అమృత్ 2.0 పథకం – కర్నూల్ నగరపాలక సంస్థ యందు రూ.131.84 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 35.6 MLD (మిలియన్ లీటర్స్ ఫర్ డే) మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాల శంకుస్థాపనకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. 35.6 MLD (మిలియన్ లీటర్స్ ఫర్ డే) మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలలో రాంబోట్ల దేవాలయం వద్ద 35 MLD (మిలియన్ లీటర్స్ ఫర్ డే) మురుగు నీటి శుద్ధి కేంద్ర నిర్మాణం, మామిదాలపాడు వద్ద 0.2 MLD (మిలియన్ లీటర్స్ ఫర్ డే) మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, మునగాలపాడు వద్ద 0.4 MLD (మిలియన్ లీటర్స్ ఫర్ డే) మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలు ఉన్నాయి.అదే విధంగా ప్రజారోగ్య మరియు పురపాలక సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో అమృత్ 2.0 పథకం – కర్నూల్ నగరపాలక సంస్థ యందు రూ. 115 కోట్ల రూపాయలతో సమగ్ర నీటి సరఫరా అభివృద్ధికి సంబందించిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జగన్నాధ గట్టు వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్, సర్వీస్ రిజర్వాయర్, గ్రావిటీ మెయిన్స్ ( ఫీడర్ మెయిన్స్) లాంటి వాటిని అభివృద్ధి, నేషనల్ హైవే కి దగ్గర్లో ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ వద్ద ఆఫ్‌టేక్ స్ట్రక్చర్ నిర్మాణం, అనువైన పంపుసెట్లు మరియు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు అదే విధంగా జగన్నాథ ఘాటు వద్ద 50 MLD (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు, ప్రతిపాదించిన నీటి శుద్ధి ప్లాంట్ వద్ద 1400 కిలో లీటర్ల సామర్థ్యం గల క్లియర్ వాటర్ సంప్ నిర్మాణం చేయనున్నారు.కార్యక్రమంలో న్యాయనిపుణులు, న్యాయవాదులు, కార్పొరేటర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.