సైనిక సంక్షేమ నిధికి లక్ష రూపాయల వితరణ..
1 min readబ్యాంక్ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
మాజీ సైనికులను, వారి కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దేశ రక్షణకోసం కర్తవ్యనిష్టతో సేవలందించిన మాజీ సైనికులను ఆదుకోవడం మనందరి విధిఅని వారికి చేయూతనందించడం విద్యుక్తధర్మమని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. విజయవాడ ప్రధాన కార్యాలయంగా గత 25 సంవత్సరాల నుండి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కోస్టల్ బ్యాంక్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వారి చేతుల మీదుగా జిల్లా సైనిక సంక్షేమ నిధికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకేటేష్ కోస్టల్ బ్యాంక్ సిసిఓ వై. సత్యనారాయణ, ఇతర బ్యాంక్ అధికారులను అభినందించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మాజీ సైనికులు, సైనిక కుటుంబాలను ఆదుకునే అవకాశాన్ని కోస్టల్ బ్యాంక్ తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా కోస్టల్ బ్యాంక్ సిసిఓ వై. సత్యనారాయణ మాట్లాడుతూ తమ బ్యాంక్ రూ. 750 కోట్ల డిపాజిట్లు కలిగి, రూ. 625 కోట్ల లోన్సుతో 50 శాఖల ద్వారా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండటమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుందన్నారు. కార్యక్రమంలో కోస్టల్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ టి. రామకృష్ణ, బ్రాంచి మేనేజరు ఎంవిఎల్ మాధురి, జిల్లా సైనిక సంక్షేమాధికారి కె.వి. సాయి ప్రసాదరావు పాల్గొన్నారు.