ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
1 min readఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్ పంపిణీ….
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలంలోని ఇంగలదహల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాస్తున్న సందర్భంగా పాఠశాలలో సరస్వతి మాత పూజ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్ లను ఎం.డి హళ్లి సర్పంచ్ సుధాకర్ ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లికార్జున పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు చేతుల మీదగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు వారి భవిష్యత్తులో ఇది మొదటి మెట్టు ఈ మొదటి మెట్లో ఏ విదంగా అయితే మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తామో భాష్యత్తులో కూడా మంచి ఉన్నత విద్యాను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి తమ తల్లిదండ్రులకు గ్రామానికి పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరారు. అదేవిదంగా పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వచ్చిన సమాధానాలను వచ్చినట్టు ముందుగా రాయాలని తెలియజేశారు. అదేవిదంగా అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కావున ఆరోగ్యం పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.