మంత్రాలయం.. జలమయం
1 min read– పొంగిపొర్లిన వాగులు, వంకలు
– ఇళ్లల్లోకి దూసుకెళ్లిన నీరు
పల్లెవెలుగు వెబ్, మంత్రాలయం : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో శనివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి మంత్రాలయం జలమయమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మండల కేంద్రంలో నల్లవాగుకు డౌన్లో పొలాల గట్లు అడ్డుగా వేయడంతో నీరు వెనక్కి ప్రవహించాయి.దీంతో మంత్రాలయంలోని పలు కాలనీలో జలమయమయ్యాయి. రామచంద్ర నగర్, సెల్ టవర్ ఏరియా, రాఘవేంద్ర పురం, బస్టాండ్, రెవెన్యూ, హై స్కూల్ తదితర ప్రాంతాల్లోకి నీరు ఇళ్లల్లోకి ప్రవహించాయి. నిత్యావసర సరుకులు తడిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నీట మునిగిన …పంటలు
భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వంకలు, వాగులు వర్షపు నీటితో పొంగి పొర్లాయి. పత్తి, మిర్చి, ఉల్లి తదితర పంటపోలాలు వర్షం నీటిలో మునిగి పోయాయి. భారీవర్షం కు జలమయం అయిన లోతట్టు ప్రాంతాలను వైయస్ ఆర్ పార్టీ నాయకులు ప్రదిప్ రెడ్డి సందర్శించారు.