ఎమ్మెల్యే చొరవతో తీరిన నీటి సమస్య..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని బీలకల గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే కాటసాని చొరవతో గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగు సాగుతున్నాయని సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు గ్రామంలో డిఎంఎఫ్ ఫండ్ కింద సీసీ రోడ్లు పొలాలకు గ్రావెల్ రోడ్లు పూర్తి చేసామని జల్జీవన్ మిషన్ కింద గ్రామంలో మొత్తం పైప్ లైన్ దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు అలాగే 90 వేల లీటర్ల కెపాసిటీ గల నీటి ట్యాంకు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నట్టు ముస్లిం కాలనీ దగ్గర్లో ఈ నిర్మాణం చేపట్టినట్టు డి ఈ వి మధుసూదన్ ఏ ఈ పవన్ కుమార్ ఆధ్వర్యంలో త్వరలో పూర్తి చేస్తున్నట్టు తెలిపారు గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో గ్రామంలో ఎటువంటి సమస్య లేకుండా పూర్తిస్థాయి అభివృద్ధి పనులు జరిగినట్టు తెలిపారు.