జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
1 min read-పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దివ్య
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వి.దివ్య సూచించారు. శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ లోక్ అదాలత్ కర్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, భారత సర్వోన్నత న్యాయస్థానం 1987 సంవత్సరంలో జాతీయ లోక్ అదాలత్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న కేసులను మరియు కోర్టులో వ్యాజ్యానికి ముందు దశలో ఉన్న కేసుల పరిష్కారానికి ఉపయోగపడు తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని ఆస్తి తగాదాలు, ప్రోనోట్, చెక్ బౌన్స్ పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. రాజీ కాదగిన క్రిమినల్ కేసులు కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని అని సూచించారు. పూర్తి సమాచారం కోసం కక్షిదారులు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా న్యాయవాదులను సంప్రదించవచ్చని తెలిపారు.