ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు వేడుక
1 min read
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ : మెర్సీ
సెయింట్ థెరీసా కళాశాల 50మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శ్రమదానంవిద్యార్థినిలు శ్రమకోర్చి సర్వీస్ చేయడం అభినందనీయం
లైన్స్ క్లబ్ కోఆర్డినేటర్, డిస్టిక్ ఉమెన్స్ సర్వీసెస్.. పద్మావతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక సిహెచ్ఎస్డి సెయింట్ థెరీసా స్వయం ప్రతిపత్తి మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారు వైఎస్ఆర్ కాలనీలో ఒక వారం రోజులపాటు నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం యొక్క ముగింపు వేడుకను వైయస్సార్ కాలనీలో ఘనంగా నిర్వహించారు.లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ఉమెన్స్ సర్వీసెస్ ముఖ్య అతిధి లయన్ పద్మావతి మాట్లాడుతూ సెయింట్ థెరీసా మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 50మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు శ్రమకు ఓర్చి అడ్డంకులను అధిగమించి గ్రామస్తుల యొక్క సమస్యలను తెలుసుకుని దానికి అవసరమైన దంత వైద్య శిబిరాలను, నేత్రవైద్య శిబిరాలను నిర్వహించి గ్రామస్తుల యొక్క సమస్యలను తెలుసుకొని దానికి పరిష్కారం మార్గాలను సూచించడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్: సిస్టర్ .మెర్సి మాట్లాడుతూ విద్యార్థులు సమర్పించిన పర్యావరణ సమతుల్యత, వైద్య శిబిరం, సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, ప్లాస్టిక్ వాడకం నియంత్రణ, యానాదుల జీవన విధానం, పాఠశాల విద్యార్థుల ప్రతిస్పందన ను మొదలైన నివేదికలను తయారుచేసి సమర్పించడం ప్రశంసనీయమన్నారు. వైయస్సార్ కాలనీ గ్రామస్తులకు సచివాలయ సిబ్బంది సహకారానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు.తదుపరి గ్రామస్తులు మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అన్న ఆర్యోక్తిని అనుసరించి విద్యార్థినులలో సేవా దృక్పథాన్ని పెంపొందింప చేస్తున్న కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు . 50 మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ కె. శ్రీలత , ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె. బ్యూలా స్వరూపా రాణి, డాక్టర్ కె. అరుణ, శ్రీమతి పి. పూజిత, శ్రీమతి పి. విజయలక్ష్మి , 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.