డి.ఆర్.ఓ గా పదవీ బాధ్యతలు చేపట్టిన జె. ఉదయ భాస్కరరావు
1 min readజిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ను కలసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా రెవిన్యూ అధికారి
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రతినిధి : శనివారం స్థానిక కలెక్టరేటు జిల్లా రెవిన్యూ ఛాంబర్ నందు జె.ఉదయ భాస్కర రావు జిల్లా రెవిన్యూ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టరు చాంబర్లో జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు నూతన జిల్లా రెవెన్యూ అధికారికి అభినందనలు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరు కార్యాలయం, జిల్లా జాయింటు కలెక్టరు కార్యాలయం, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయ అధికారులు, సిబ్బంది క్రొత్త జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కర రావు ను కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు, శుభాకాంక్షలను తెలిపారు.