వాల్మీకులకు ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వని పార్టీలకు ఓటమి తప్పదు
1 min readఆలూరు ఎమ్మెల్యే స్థానం వాల్మీకులకే ఇవ్వాలని ప్రధాన పార్టీల నాయకులను డిమాండ్ చేసిన ఆలూరు నియోజకవర్గం యువనాయకుడు, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్.
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకి/బోయ సామాజిక వర్గం. ఎన్నో ఏళ్లుగా పార్టీలకు అన్ని విధాలుగా సేవలను చేస్తూ పార్టీ జెండాలను భుజాల మీద మోసుకుని అన్ని పార్టీలలో ప్రాణాలను సైతం అర్పించడం కోసం లెక్క చేయకుండా నిస్వార్థంగా జెండాలను పట్టుకుని కేసులను మోసుకుని నాయకులు ఎంతమంది మారిన మేము మాత్రం మారమని పార్టీలకు కట్టు బానిసలుగా వున్నటువంటి మన వాల్మీకి సహోదరులకు మాత్రం పార్టీలు గుర్తించి ఎమ్మెల్యే గా అవకాశాలు ఇవ్వకుండా నట్టేట ముంచేస్తున్న ప్రధాన పార్టీలు ఇప్పటికైనా మన వాల్మీకులను గుర్తించి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని APVBS సంఘం తరుపున డిమాండ్ చేస్తున్నాము.లేని పక్షంలో వాల్మీకును విస్మరించే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పె రోజులు దగ్గరలోనే వున్నాయని ప్రధాన పార్టీల నాయకులకు హెచ్చరిస్తున్నాము.