బేటీ బచావో బేటీ పడావో పై అవగాహన
1 min readబాలికను రక్షిద్దాం… బాలికను చదివిద్దాం
ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటేశ్వరమ్మ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బాలికను రక్షిద్దాం బాలికను చదివిద్దాం అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింప చేస్తామని ప్రమాణం చేస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్ వైజర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. శనివారం మండల పరిధిలోని కోళ్ల భాపురం గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో అంగన్ వాడీ కార్యకర్త అరుణ దేవి ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో పై బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ బాలికల కోసం బేటి బడావో బేటి పడావో అనే పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని తెలిపారు. దేశంలో ఆడపిల్లల చుట్టూ తిరుగుతున్న సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చే ఒక చొరవన్నారు. లింగ నిష్పత్తులను సమతుల్యం చేయడం, ఆడపిల్లల హక్కులపై దృష్టి సారించడం, బాలిక పిల్లల విద్యలో ప్రవేశాన్ని సాధించడం, ఆడ శిశు హత్యలను అరికట్టాలని,ప్రతి ఆడపిల్లకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ సావిత్రి, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.