సమస్యలులేని నగరంగా తీర్చిదిద్దుతా: కర్నూల్ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
1 min readఒకటో వార్డులో వార్డు టీజీ భరత్ భరోసా యాత్ర
సమస్యలు మొరపెట్టుకున్న వార్డు ప్రజలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమస్యలు లేని కర్నూల్ నగరంగా తీర్చిదిద్దుతానని కర్నూల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఒకటో వార్డు ఖండేరి, చిదంబరరావు స్ట్రీట్‌లో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల మేనిఫెస్టోతోపాటు ఆయన స్వయంగా రూపొందించిన ఆరు గ్యారంటీల కరపత్రాలను అందించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగలను చూపించి ఈ సమస్యలు తీర్చాలని మొరపెట్టుకున్నారు. శుక్రవారం జమ్మిజట్టు వద్ద విద్యుత్ స్తంభం మండిపోయిన దృశ్యాలను చూసి భయాందోళనకు గురయ్యామని చెప్పారు. ఈ కరెంట్ తీగలను ఇలాగే వదిలిస్తే.. తమ ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూల్ మొత్తం ఇలాంటి పరిస్థితి ఉందని, దీంతోపాటు ఇతర సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు. సరైన నాయకుడు లేకపోవడం వల్లే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. కర్నూల్‌లో ఉన్న సమస్యలను పదేళ్ల నుంచి చూసి.. ఆరు గ్యారంటీలు రూపొందించినట్లు చెప్పారు. ఇవన్నీ పరిష్కరిస్తే ప్రజలకు ఇబ్బందులే ఉండవన్నారు. తనకు ఇంతవరకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదని.. ఒక్క అవకాశం ఇస్తే తన పనితీరు ఏంటో ప్రజలకి తెలుస్తుందన్నారు. పదేళ్లుగా అధికారంలో లేకపోయినా తమ టీజీ కుటుంబం ప్రజా సేవలోనే ఉందన్నారు. సేవ చేసే వారికి ప్రజల మద్దతు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, హమీద్ బాషా, రమీజ్, ఆయాత్ బి, ప్రభాకర్, మున్నా, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇంఛార్జీలు, జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.