టిడిపిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం.. కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
1 min readవైసీపీని వీడి టిడిపిలో చేరిన వందలాది మంది యువకులు
ఏపీకి చంద్రబాబు, కర్నూలుకు టి.జి భరత్ అవసరమన్న యువకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కర్నూలు నియోజకవర్గంలోని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు, మహిళలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి టి.జి భరత్ మాట్లాడారు. కర్నూల్లోని వాడవాడలా పార్టీ బలోపేతం అయ్యిందన్నారు. వార్డుల్లో వైసీపీకి చెందిన కీలకమైన వ్యక్తులు తమ పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో కరెంటు చార్జీలు, మున్సిపాలిటీ పన్నులు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అన్నారు. మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు ఉంటే సమస్యలే ఉండవన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ఎంత అవసరమో, కర్నూలుకు తాను అంత అవసరమని ఆయన చెప్పారు. ఇప్పుడున్న నాయకులు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి స్మార్ట్ సిటీ చేశామని గొప్పులు చెప్పుకుంటున్నారని, నిజంగా స్మార్ట్ సిటీ అయి ఉంటే ప్రజలకు సమస్యలు ఎలా ఉంటాయని టి.జి భరత్ ప్రశ్నించారు. నగరంలో ఏ వీధికి వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. ఇక కర్నూల్లో కులం చూసి ఓటు వేసి ఈ ఐదేళ్లు నష్టపోయామని, ప్రజలు మళ్లీ ప్రయోగాలు చేసి మోసపోవద్దని సూచించారు. మరో 50 రోజులు కష్టపడితే ప్రజల ప్రభుత్వం వచ్చేస్తుందన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడు స్థానికంగా ఉండే వ్యక్తి కాదన్నారు. తాము ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు.
పార్టీలో చేరిన వారిలో ..
తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కీటూ గోపి ఆధ్వర్యంలో 50వ వార్డుకు చెందిన బబ్లూ, నరసింహులు, నవీన్, 51వ వార్డు నుండి లక్ష్మణ్, కిరణ్‌ల ఆధ్వర్యంలో భారీగా యువకులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు.టిడిపి నేత ఊట్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో కుమ్మరిగేరికి చెందిన షేక్ మున్నార్ తో పాటు ఆయన బృందం వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.టిడిపి నేత కలీం ఆధ్వర్యంలో 7వ వార్డుకు చెందిన వైసీపీ కీలక నాయకులు ఇంతియాజ్, హాజీ, మౌలాలి, షాషా, ఫైరోజ్, రాజా, నయీం, ఫరూఖ్, అబ్దుల్లాతో పాటు భారీగా యువకులు టిడిపిలో చేరారు.చేపల రమేష్ ఆధ్వర్యంలో 8వ వార్డు పెద్దపడఖానాకు చెందిన డాక్టర్ శేషన్నతో పాటు స్థానికులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.టిడిపి నాయకుడు మోహన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు టి.జి భరత్‌కు మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారంతా కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని చెప్పారు.