ఇలా చేయకపోతే మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అవుతుంది !
1 min readపల్లెవెలుగు వెబ్ : థర్డ్ పార్టీ యాప్స్ ను సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్ భద్రతా ప్రమాణాలను యాప్స్ ధృవీకరించలేవని పేర్కొంది. టెంపరర్లీ బ్యాన్డ్ అని మెసేజ్ వస్తే.. అది తప్పకుండా అధికారిక వాట్సాప్ యాప్ కాదని, అన్ సపోర్టెడ్ వర్షన్ గా గుర్తించాలని సూచించింది. తాత్కాలిక బ్యాన్ తర్వాత అధికారిక వాట్సాప్ యాప్ కి మారకపోతే… ఆ అకౌంట్ శాశ్వతంగా బ్యాన్ అవుతుందని తెలిపింది. వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ లాంటి యాప్స్ పూర్తీగా థర్డ్ పార్టీ తయారు చేసిన యాప్స్ అంటూ వాట్సాప్ స్పష్టం చేసింది.